Wednesday, 29 August 2018

నటుడు హరి కృష్ణ మృతి


లైవ్‌ అప్‌డేట్స్‌: మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు

29 Aug, 2018 08:24 IST
సాక్షి, నల్లగొండ/ హైదరాబాద్‌ : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఎన్టీఆర్‌ తనయుడు, రాజకీయ నాయకుడు, నటుడు హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. హరికృష్ణ నడిపిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ ఘటనకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవి:
  • రేపు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. సాయంత్రం అంతిమయాత్ర ప్రారంభకానుంది. హరికృష్ణ భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే
  • హరికృష్ణ పార్దీవ దేహానికి గవర్నర్‌ నరసింహన్‌ నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
  • హరికృష్ణ భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు జగదీష్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లు నివాళులు అర్పించారు.
     
  • హరికృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన నివాసానికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సీఎం సెక్యురిటీ సిబ్బంది, హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజన్ కుమార్ భద్రత చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
  • హరికృష్ణ భౌతిక కాయం హైదరాబాద్‌ చేరుకుంది. మెహిదీపట్నంలోని ఆయన నివాసానికి తరలించారు.
160 కి.మీ వేగం.. వాటర్‌ బాటిల్‌ కోసం వెనక్కి తిరిగారు!
నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైన రోడ్డుప్రమాదానికి సంబంధించి పలు కీలక వివరాలను నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ వెల్లడించారు. అతివేగమే హరికృష్ణ మృతికి కారణమని తెలిపారు. ప్రమాదం జరిగే సమయంలో ఫార్చునర్‌ కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోందని, ఈ సమయంలో వాటర్‌ బాటిల్‌ కోసం కారును నడుపుతున్న హరికృష్ణ వెనక్కి తిరగడంతో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పిందని ఆయన తెలిపారు. దీంతో డివైడర్‌ను ఢీకొట్టి 15 మీటర్ల దూరంలోకి కారు ఎగిరిపడిందని, డ్రైవింగ్‌ సీట్లో ఉన్న హరికృష్ణ 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారని ఎస్పీ వివరించారు. సీటు బెల్ట్‌ పెట్టుకుంటే ప్రమాద తీవ్రత తగ్గేదన్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
  • నటుడు, మాజీ మంత్రి హరికృష్ణ భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో గురువారం జరగనున్న అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, ఈ విషయమై కుటుంబసభ్యులతో మాట్లాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు. మెహిదీపట్నంలోని నివాసానికి హరికృష్ణ భౌతికకాయాన్ని తరలించారు. హరికృష్ణ భార్య షాలినీ, కోడలు ప్రణతి ఇప్పటికీ నివాసానికి చేరుకున్నారు.

No comments:

Post a Comment